సినీ పరిశ్రమలో అవకాశాల కోసం అడుగుపెట్టడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత సక్సెస్ను నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. సినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటే ఎంతో కష్టపడాలి.ఒకవేళ వచ్చిన టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని చెప్పవచ్చు. ఇక అతి తక్కువ వయసులోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ గా సత్తా చాటిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
1). శ్రీదేవి:
టాలీవుడ్ లో అతిలోకసుందరిగా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ 13 ఏళ్ల వయసులోనే ప్రారంభించింది తన నటనతో అందంతో ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించిన శ్రీదేవి టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా నటించింది.
2). హన్సిక:
చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించిన ఈమె దేశముదురు సినిమాతో పదహారేళ్ళ వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది.
3). శ్వేతా బసు ప్రసాద్:
కొత్త బంగారులోకం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్వేతా బసు ప్రసాద్ 17 ఏళ్ల వయసులోకి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. గతంలో కూడా ఈమె పలు చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించింది.
4). కృతి శెట్టి:
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ డమ్ సంపాదించుకున్న కృతి శెట్టి 17 సంవత్సరాలకే తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది. ఇటీవల పలు సినిమాలలో నటిస్తోంది.
5). చార్మి:
హీరోయిన్ ఛార్మి తన సినీ కెరియర్ ని నీ తోడు కావాల్సిన మాతో 15 సంవత్సరాలకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఎంతోమంది హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక వీరితోపాటు తమన్నా ,సాయేషా సైగల్ ,నందిత రాజ్ తదితర హీరోయిన్స్ సైతం 20 సంవత్సరాలలోపు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.