తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ప్రేక్షకులను భాగా ఆలరించారు . అందులోయాంకర్ సుమ, శ్రీముఖి, వర్షిని, దీపిక పెళ్లి తదితరులు ఉన్నారు. ఇందులో శ్రీముఖి ఎంతటి పాపులార్టీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..శ్రీముఖి ఇక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ప్రతి ఒక్క ఛానల్లో కూడా అనేక కార్యక్రమాల కోసం ఒప్పందం పెట్టుకుని పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ వస్తోంది. ఈ బ్యూటీ ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానల్స్ లో యాంకర్ గా ముందుకు దూసుకుపోతోంది.
అయితే గత ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తాను ప్రేమలో ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటన ఇచ్చింది. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకుంటానని ప్రకటించింది. ఈ మాట చెప్పి ఏడాది అవుతున్నా కూడా ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు శ్రీముఖి.దాంతో అభిమానులకు అనుమానం వస్తోంది.శ్రీముఖి లవ్ బ్రేకప్ అయ్యిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు శ్రీముఖి ఎవరిని లవ్ చేసింది అనే విషయంపై కూడా క్లారిటీ లేకుండా పోయింది.
శ్రీముఖి మరియు ప్రదీప్ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వినిపించాయి.. కానీ అది ఏ మాత్రం వాస్తవం కాదని ఇద్దరు పేర్కొన్నారు. శ్రీముఖి ప్రేమించింది ఇండస్ట్రీలో వాళ్లని కాదు బయట వ్యక్తిని అనేది బుల్లితెర వర్గాల్లో వినిపిస్తున్న టాక్ వినిపిస్తోంది .అయితే ఈ విషయంపై కూడా క్లారిటీ రాలేదు. కనీసం ఈ వాలెంటెన్స్ డే సందర్భంగా శ్రీముఖి తన యొక్క ప్రేమ వ్యవహారాన్ని ఫుల్ క్లారిటీగా చెప్తుందేమో చూడాలి. ఇంతకు శ్రీముఖి ఎవరిని ప్రేమించిందో ఆయన ఎవరో ఏమో అన్న విషయం మాత్రం బయటకి రావడం లేదు. ఈ విషయంపై శ్రీముఖి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.