సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్థిరపడాలి అంటే కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఎంతోమంది నటీమణులు కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారనే విషయాన్ని పలు సందర్భాలలో తెలియజేయడం జరిగింది. అలాగే కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలోనే మాత్రమే కాదు ప్రతి రంగంలో కూడా ఉన్నదని మహిళలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మన వ్యవహార శైలి మన ప్రవర్తన బట్టి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలోనే దక్షిణాదిశగా ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు అగ్ర హీరోయిన్గా కొనసాగిన ఈమె సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా పేరుపొందింది.. ఇక వివాహమైనప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నయనతార క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందో లేదో అనే విషయం గురించి తాను మాట్లాడనని.. అయితే మన ప్రవర్తన బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని తెలియజేస్తోంది.
తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటిలో తనని కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారని అయితే తనకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పానని తెలిపింది నయనతార .సొంత టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీ లోకి వచ్చాను ఆ టాలెంట్ తోని ప్రస్తుతం ఈ స్థాయిలోకి చేరుకున్నాను అంటూ నయనతార క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం నయనతార చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.