తెలుగు ఇండస్ట్రీలో నరసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన మాట్లాడుతుంటే చిన్న పిల్లల మనస్తత్వం లా అనిపిస్తాయి. 62 సంవత్సరాలు వచ్చినా కూడా బాలయ్య సినిమాలలో, రాజకీయాలలో సత్తా చాటుతూ ప్రేక్షక ఆదరణ పొందుతున్నాడు. సినిమాలోనే కాదు రాజకీయాల్లో,ఆన్ స్టాపబుల్ షో ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు బాలయ్య. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బాలయ్యకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాయి.
అంతేకాకుండా ఆన్ స్టాపబుల్ సీజన్-1, ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఆయనకు ఎంతో క్రేజును అందించాయి.గతంలో మెగా ఫ్యామిలీ పై బాలయ్య విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మా బ్లడ్ వేరు మా బ్లేడ్ వేరు అని బాలయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ గా మారాయి… ఒక ఈవెంట్ లో అమ్మాయికి ముద్దైనా పెట్టాలి. అన్న మాటకి మహిళా సంఘాల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయని సంగతి తెలిసిందే.
బాలయ్య ఇలా అనవసర వివాదాల్లో చిక్కుకోవడం ఫాన్స్ కి ఏ మాత్రం నచ్చటం లేదు. ఒకవైపు బాలయ్య చేసిన కామెంట్స్ ను ఏ విధంగా సమర్థించాలో అభిమానులకు అర్థం కావడం లేదు. అక్కినేని ఫ్యామిలీ గురించి తాజాగా.. బాలయ్య అక్కినేని తొక్కినేని అని బాలయ్య చేసిన కామెంట్స్ వల్ల బాలయ్య కు అక్కినేని ఫ్యామిలీకి గ్యాప్ ఉందని చెప్పకనే చెప్పేశారు. నాగార్జున బాలయ్య షోకు హాజరు కాకపోవడానికి ఈ గొడవలే కారణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మరోవైపు ఎమ్మెల్యేగా ఇలాంటి వివాదాలు ఎందుకు అని రాజకీయ విశ్లేషకుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలయ్య మారాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇతరులను కించపరచడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు.