వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక బాలకృష్ణ మాటల పైన అక్కినేని కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు తాజాగా ఈ విషయంపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా రియాక్ట్ కావడం జరుగుతోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, S.V. రంగారావు లాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరచుకోవడమే అంటూ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉండే నాగచైతన్య, అఖిల్..తాజాగా బాలయ్య కామెంట్స్ మీద స్పందించడంతో టాలీవుడ్ లో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ , ఏఎన్ఆర్ పైన పలు వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్లు సైతం బాలయ్యను టార్గెట్ చేస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీర సింహారెడ్డి విజయోత్సవ సక్సెస్ మీట్ లో ఫుల్ జోష్ లో మాట్లాడిన బాలయ్య సడన్గా ఈ చిత్రంలోని ఆర్టిస్టుల గురించి ప్రస్తావించడం జరిగింది.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
ఇక తమ మధ్య రకరకాల విషయాలకు చర్చలు వచ్చాయి. నాన్నగారు.. ఆ డైలాగులు.. రంగారావు గారు.. ఈ అక్కినేని అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. పాత సినిమాలకు సంబంధించిన పలు విషయాలు చర్చించుకున్నామని చెప్పే క్రమంలో అక్కినేని అంటూ బాలయ్య మాట్లాడడం జరిగింది.. అయితే తాజాగా ఈ వీడియో వైరల్ గా మారడంతో అక్కినేని ఫ్యాన్స్ బాలయ్య పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ పలు రకాలుగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం అక్కినేని బ్రదర్స్ షేర్ చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై నాగార్జున మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023