కృష్ణ కెరియర్ లో ఆగిపోయిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.తెలుగు సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు సంపాదించారు. కృష్ణ ఐదు పదుల వయసులో కూడా తన సినిమాలలో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించారు. ఆ వయసులో కూడా కృష్ణ 300కు పైగా సినిమాలలో నటించారు. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలలో చిత్రాలతో, టెక్నాలజీతో ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. కృష్ణ కి పూర్తిగా రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా సరే సినిమా విడుదలయితే చాలనుకునే వారట. అంతేకాకుండా నిర్మాత నష్టపోతే తాను నష్టపోయారని ఫీలింగ్ ఏర్పడేదట.

Telugu film superstar Krishna Garu passes awayఅలా కొన్ని ప్లానింగ్ లోపాల వల్ల కృష్ణ కొన్ని చిత్రాలు ఆగిపోయాయట. డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి కృష్ణ కాంబినేషన్లో పసిడి పంటలు సినిమాలో హీరోయిన్గా భానుప్రియ అని కూడా ఎంపిక చేశారట. ఇందులో సత్యనారాయణ కూడా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చాక నిర్మాతలలో ఒకరు మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేదు.

ఇక తర్వాత దుర్గా నాగేశ్వరరావు డైరెక్షన్లో కృష్ణ హీరోగా ప్రతాపరుద్రుడు సినిమాని 1990లో మొదలుపెట్టారు. ఎందుకు వెంకటేశ్వర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారట. హీరోయిన్ రెండవ షెడ్యూల్ అయ్యాక కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయింది. ఇక తర్వాత కొత్త డైరెక్టర్ శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో అదరహో అనే సినిమాని ప్రారంభించారు ఇందులో రంభ హీరోయిన్ రెండు సాంగ్స్ పూర్తి అయ్యిందట.ఆ సమయంలో సంప్రదాయం మూవీ మొదలవడం వల్ల అది రిలీజై ప్లాప్ కావడంతో అధరహో మీద ప్రభావం పడింది దీంతో షూటింగ్ ముందుకు సాగలేదట. ఇక ఇవే కాకుండా వారెవా మొగుడు పూరి జగన్నాథ్ తిల్లానా.. బొబ్బిలి దొర తదితర చిత్రాలు నిలిచిపోయాయట.

Share.