సినీ ఇండస్ట్రీలో ఎవరు ఏ విధంగా ఉంటారో చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు.. ఎంతో ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు సైతం ఏడాది తిరగకముందే విడాకులు బాట పడుతున్నారు. మరి కొంతమంది నటీనటులు వివాహం చేసుకొని సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టక కూడా ఎన్నో మనస్పర్ధలు రావడంతో విడిపోతూ ఉన్నారు.ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ వివాహమైన ఒక స్టార్ హీరోని మళ్లీ వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
కీర్తి సురేష్ వివాహం చేసుకోబోయే స్టార్ హీరో ఎవరో కాదు కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన హీరో విజయ్ దళపతి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సంగీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వివాహమైన ఈ హీరోని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు ట్రెండీగా మారుతున్నాయి. అంతేకాకుండా ఈమధ్య కాలంలో విజయ దళపతి తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇలాంటి విషయంపై నటుడు విజయ్ దళపతి కానీ సంగీత గాని ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీరిద్దరి మధ్య విడాకులు రావడానికి కీర్తి సురేష్ కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తన భార్య పిల్లలని మోసం చేసి కీర్తి సురేష్ ని వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి నేపథ్యంలో చాలామంది నేటిజన్స్ సైతం జస్టిస్ ఫర్ సంగీత అంటూ ఒక ట్యాగ్ ను ట్రెండీ గా చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారు చూడాలి.