నటసింహ నందమూరి బాలకృష్ణ తెరకెక్కించే మాస్.. యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకు ఈయన తెరకేక్కించిన దాదాపు అన్ని సినిమాలు కూడా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించి మాస్ ఆడియన్స్ కు మంచి వినోదాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాని కూడా తెరకెక్కించి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు బాలయ్య. అయితే ఈ సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే విడుదలైన విషయం తెలిసిందే.
ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చిత్రంలో బాలకృష్ణ నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య రాయలసీమ నుంచి కాకుండా తెలంగాణ నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తాజాగా వీరసింహారెడ్డి సక్సెస్ అయిన నేపథ్యంలో వీర సింహుని విజయోత్సవ వేడుకల్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఎన్.బి.కె 108 గురించి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అభిమానులందరికీ అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వడం జరిగింది. బాలకృష్ణ సాధారణ ప్రజలతో పాటు అభిమానులకు కూడా ఆ సినిమా ఎంత బాగా నచ్చాలని జాగ్రత్త తీసుకుంటారు.
కాబట్టే ప్రతి సినిమాకి కూడా ఎన్బికె టచ్ యాడ్ చేస్తారు. అదే టచ్ తో ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమా కూడా వచ్చింది ఎన్బికె టచ్ తో మళ్ళీ 108 సినిమా కూడా రాబోతున్న నేపథ్యంలో కొన్ని మార్పులు చేసాము.
ఈసారి రాయలసీమలో కాదు తెలంగాణలో దిగుతుండు.. కలెక్షన్లతో కుర్బానీ పెడతాడు.. బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత షురూ చేస్తాడు.. గెట్ రెడీ అంటూ సినిమా ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు అనిల్ రావిపూడి.