తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిని చెప్పవచ్చు. అయితే ఈమెకు గత ఏడాది మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఈమె చేసిన నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో మరొకసారి ఇమే ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసుకుంది. ఈ నేపథ్యంలోని ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో నటిస్తోంది. కేవలం ఈమె ఆశలన్నీ కూడా ఈ సినిమా పైన పెట్టుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. మహేష్ బాబు ఒక యాక్షన్ ఎపిసోడ్ పాల్గొన్నారు. ఈ షూటింగ్లో మహేష్ బాబు తో సహా పూజా హెగ్డే అలాగే శ్రీ లీల మధ్య కొన్ని సీన్లు షూట్ చేయవలసి ఉన్నదట. నిజానికి ఈ సినిమా ప్రారంభించిన సమయంలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుందని అందరూ ప్రకటించారు.కానీ అప్పట్లో సెకండ్ హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తారని ప్రకటించలేదు. కానీ తాజాగా ఆమె సినిమాలో నటిస్తుందని విషయం మీద క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగ వంశీ.
వాస్తవానికి మొదట కథ అనుకున్న ప్రకారం ఒక హీరోయిని ఉంటుందని కానీ మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ మార్చమని అడిగిన తర్వాత ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా వచ్చి చేరిందని.. అయితే త్రివిక్రమ్ గత సినిమాలలో సెకండ్ హీరోయిన్ కు పాత్ర చాలా పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఈ సినిమా రాసిన కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లకు సమ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దీంతో పూజ హెగ్డే కి ఇప్పుడు శ్రీ లీల తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతొంది.. దీంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది పూజ హెగ్డే..కానీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన శ్రీలిల టాలీవుడ్లో స్టార్ క్రేజీని దక్కించుకుంది. మరి ఈ నేపథ్యంలో సినిమా క్రెడిట్ అంతా ఆమెకు వెళ్ళిపోతుందని భయం లో పూజా హెగ్డే ఉందని సమాచారం.