టాలీవుడ్ లో హీరోయిన్ మెహ్రిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. తెలుగులో పాటు హిందీ, తమిళ్, పంజాబీ వంటి భాషలలో కూడా సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా కొంతకాలానికి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోడుతో ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత వీరిద్దరూ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.
ఇక వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే తను చేసిన సినిమాలలో ఎఫ్2 సినిమా మంచిగా సక్సెస్ అయ్యింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. అలాగే మరొక హీరోయిన్ తమన్నా కూడా నటించింది. ఈ సినిమా సీక్వెల్ గత ఏడాది f-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేకపోయినా కలెక్షన్ల పరంగా బాగానే రాబట్టింది.
ఈ చిత్రంలో మెహ్రిన్ నటన చూసి కాస్త ఓవరాక్షన్ చేస్తోంది అని కామెంట్లు కూడా వినిపించాయి. దీంతో ఈ ముద్దు గుమ్మకు అవకాశాలు భారీగానే తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమే తెలుగులో స్పోర్ట్ అనే ఒక చిన్న సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ సినిమా లో యంగ్ హీరో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫ్లాప్ అయితే కెరియర్ అట్టకెక్కినట్టే అని చెప్పవచ్చు. ఇక కథల పరంగా కంటెంట్ పరంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.