తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బార్య నమ్రత కూడ హీరోయిన్గా ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించింది. ఇక మిస్ ఇండియా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ కూడా పనిచేసిందట. 1993లో మిస్ ఇండియా.. మిస్ ఏసియా పసిఫిక్ గా కూడా ఎంపికయింది. అటు తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన వంశీ చిత్రంతో ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
నిన్నటి రోజున నమ్రత పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈమె వయసు 51 సంవత్సరాలు. నమ్రత 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. ఈమె అక్కా శిల్ప శిరోద్కర్ కూడా బాలీవుడ్లో పలు చిత్రాలను నటించింది. నమ్రత నానమ్మ మీనాక్షి సిరోత్కర్ కూడా ప్రముఖ మరాఠీ నటి. ఆమె 1938లో బ్రహ్మచారి అనే చిత్రంలో కూడా నటించింది. ఇక నానమ్మ వారసత్వంతో శిల్ప, నమ్రత ఇద్దరు కూడా హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిందట.
అలా నమ్రత ఫ్యామిలీలో కేవలం ఆమె మాత్రమే కాకుండా ఆమె యొక్క నానమ్మ కూడా ప్రముఖ హీరోయిన్ అని చెప్పవచ్చు. మహేష్ బాబు వంశీ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒకరినొకరు ఇష్టపడడంతో కొంతకాలం పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత 2005లో ఫిబ్రవరి 10న ముంబైలో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని విషయాలను నమ్రతానే దగ్గరుండి చూసుకుంటోంది.