సంక్రాంతికి విడుదలైన వాల్తేర్ వీరయ్య సినిమా మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. అయితే వాల్తేర్ వీరయ్య విషయంలో కొన్ని భిన్నా భిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలు చాలా పెద్ద స్టార్స్ క్యాస్టింగ్ తీసుకున్నప్పటికీ వారి పాత్రలను పరిమితం చేశారని కూడా సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విలన్ రావత్ లాంటి నటుడుని జూనియర్ ఆర్టిస్టుగా కన్నా తక్కువగా చూశారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రదీప్ రావత్ సౌత్ ఇండియా తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి పేరున్న నటుడు.. మొదట టాలీవుడ్ లో సై సినిమాలో విలన్ గా నటించి ఆ తర్వాత అనేక సినిమాలలో విలన్ గా నటించారు. ప్రస్తుతం సినిమాలలో హవా కాస్త తగ్గినప్పటికీ చిరంజీవి సినిమాలో ఇలా తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడం ఆయన అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఆ మధ్యకాలంలో ప్రదీప్ రావత్ తెలుగు చిత్ర సీమకు కొన్ని విభేదాలు కారణంగా దూరమయ్యారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అడపాదడప చిన్నచిన్న పాత్రలలో కనిపిస్తూ ఉన్నారు.
అయితే చిరంజీవి సినిమాలో ప్రదీప్ రావత్ కనిపించడం మంచి విశేషమే అయినప్పటికీ ఒక డైలాగు కూడా లేని పాత్ర చేయడం ఆయన స్థాయికి తగ్గట్టు కాదని డైరెక్టర్ బాబీని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. దీంతో ప్రదీప్ ని అవమానించడంతో సమానం అంటూ పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది