టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. మొదట వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అలా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఇటీవల కాలంలో రకుల్ హవా టాలీవుడ్లో కాస్త తగ్గిందని కూడా చెప్పవచ్చు. రకుల్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
రకుల్ ప్రీతిసింగ్ చివరి సారిగా తెలుగులో కొండ పొలం సినిమాలో నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో నటించిన చత్రివాలి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇదే కాకుండా ఈ అమ్మడి చేతిలో భారీ బడ్జెట్ మూవీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది. తాజాగా తన కెరియర్ ప్రారంభం గురించి తను ఎదుర్కొన్న సమస్యల గురించి గుర్తుచేసుకుంది.
రకుల్ ప్రీతిసింగ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను అవకాశాల కోసం ఆడిషన్స్ కు వెళ్లే దాన్ని రోజుకు ఐదు నుంచి పది ఆడిషన్స్ కు వెళ్లేదాన్ని.. బ్యాగులో బట్టలు పెట్టుకొని చాన్సుల కోసం తిరిగాను ఆ సమయంలో కారులోని బట్టలు మార్చుకునే దాన్ని ఒకసారి నన్ను ఒక సినిమాకు సెలెక్ట్ చేసి షూటింగ్ చేసి ఆ తర్వాత హీరోయిన్ ని మార్చేశారని తెలుపుకొచ్చింది. ఆ సమయంలో కూడా ఎంతో కష్టపడి అవకాశాల కోసం తిరిగానని తెలుపుతోంది. కష్టపడకుండా ఏది అంత సులువుగా రాగానే విషయాన్ని నమ్ముతాను ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.