వామ్మో సలార్ సినిమా బడ్జెట్ అన్ని వందల కోట్లా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ ప్రాజెక్టు నుంచి అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ సినిమా మూవీ అప్డేట్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అంటూ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

Salaar: Prabhas' rugged look unveiled on his birthday, fans say 'this is  the only hope' | Regional-cinema News – India TV

అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల కాలేదు.. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ .250 కోట్ల రూపాయలు అనుకోగా.. ఏకంగా ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు మారిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా బడ్జెట్ ప్రస్తుతం రూ .400 కోట్లకు చేరినట్లు సమాచారం. సలాడ్ పార్ట్-2 కలిపి ఈ బడ్జెట్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆస్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అనుమానాలు కూడా ఫ్యాన్స్ మనసులో ఆందోళన కలుగుతోంది.

Salaar: Prabhas' Leaked Pic | cinejosh.com

ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది .ఈ చిత్రం తెలుగు, కన్నడ ,హిందీ, తమిళ్, మలయాళం వంటి భాషలలో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Share.