టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అంత పెద్ద అగ్ర హీరోల సినిమాలు థియేటర్లో ఒకేసారి విడుదల చేయడం సులువైన విషయం కాదు. అయితే మైత్రి నిర్మాతలు మాత్రం రిస్క్ చేసి మరి ఏకంగా సంక్రాంతికి రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలను నైజాం ఏరియాలో దిల్ రాజ్ కు పోటీగా రిలీజ్ చేయటం కష్టమైన టాస్క్.. అయినా మైత్రి నిర్మాతలు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమాలను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమా కష్టానికి ప్రతిఫలంగా 10 కోట్ల రూపాయల లాభంలో ఉన్నారని సమాచారం అందుతోంది.
ఇక రాబోయే రోజుల్లో దిల్ రాజుకు మరిన్ని షాక్ లు తగిలినా ఆశ్చర్యపోనవసరం లేదు. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల కలెక్షన్లకు నైజాం ఏరియా కీలకం అనే సంగతి తెలిసిందే. నైజాం ఏరియాలో సత్తా చాటాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నించినా… ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయారు. ఇక మైత్రి నిర్మాతలు ఎంట్రీ ఇవ్వటంతో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. సంక్రాంతి పండక్కు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను.. అగ్ర హీరోల సినిమాలుగా రిలీజ్ చేయటంతో మైత్రి సంస్ధ ఎంతో పెద్ద సక్సెస్ లను అందుకుంది. ఇక రాను రాను ఈ సంస్థ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని కథల విషయంలో మైత్రి నిర్మాతలు ఫర్ఫెక్ట్ గా ముందడుగు వేస్తారు.
ఇక రాబోయే రోజుల్లో మైత్రి బ్యానర్ పై ఇంకెన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయో.. అలాగే మైత్రి నిర్మాతలు కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కూడా ఈ బ్యానర్ లో తెరకక్కనుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ నిర్మాతలు సత్తా చాటు తారేమో వెయిట్ చేయాల్సిందే.