మొదట కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్ ఫోటో సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు సుహస్. ఇక ఫ్యామిలీ డ్రామా గా సినిమాలలో నటిస్తూ ఉన్న సుహస్ అడవి శేషు నటించిన హీట్ -2 చిత్రంలో సైకో కిల్లర్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మరొకసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసి యూనిట్ల మహేష్ బాబు ప్రశంసించడం జరిగినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ వేదికగా రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ను లింకును షేర్ చేసి మహేష్ మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సినిమా నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రాలను ట్యాగ్ చేయడం జరిగింది. అలాగే సుహస్ హీరోయిన్ టీనా శిల్ప రాజ్ లకు ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేశారు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నానంటూ ట్విట్టర్లో తెలియజేశారు మహేష్ బాబు. ఇక తన సినిమాపై మహేష్ ట్విట్ చేయడంతో ఆనందంతో ఉబ్బిపోయిన సుహాన్ పోకిరి సినిమా టికెట్ల కోసం వెళ్లి విజయవాడ అలంకార థియేటర్లో తన చొక్కా చిరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు చూసిన చొక్కా నేను చింపుకొని అంత ఆనందం వచ్చింది అని తెలియజేశారు.
దీంతో సుహాన్ థాంక్యూ సో మచ్ సార్ హ్యాపీ మోస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ మహేష్ పైన అభినందనలు తెలియజేశారు. ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో సుహాన్ ఒక బుక్కు రైటర్ గా కూడా కనిపించబోతున్నారు. సీనియర్ నటులు రోహిణి కీలకమైన పాత్రలో పోషిస్తుంది.ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను గీత ఆర్ట్ సంస్థ డిస్ట్రిబ్యూటర్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోతున్నాయి.
Appudu Pokiri ticket lu kosam Vijayawada alanakar Theater lo na chokka chirigipoyindhi..ippudu e tweet chusi na chokka nene chimpukune antha anandam vacchindhi..thank you so much sir..happiest fan boy moment ♥️ https://t.co/l5BsCIbEb2
— Suhas 📸 (@ActorSuhas) January 20, 2023