కేరళ ఎర్నాకులంలో ఒక విద్యార్థి హీరోయిన్ అపర్ణ బాలమురళి తో చాలా అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ విద్యార్థి ప్రవర్తన పట్ల అంత తీవ్రంగా మండిపడుతున్నారు. చాలా ఓవర్ చేశారని మరి కొంతమంది ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఘటన పైన హీరోయిన్ అపర్ణ స్పందించడం జరిగింది. ఈ ఘటన తనని చాలా బాధించిందని.. లా చదువుతున్న విద్యార్థి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరం అన్న సంగతి తెలియదా బలవంతంగా తన చేయి పట్టుకొని కూర్చిలో నుంచి పైకి లేపడం సరికాదు..
అలాగే తన భుజాలపైన చేతులు వేసేందుకు కూడా ప్రయత్నించాడు.. ఒక మహిళతో అతడు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది కాదంటూ ఈ ఘటన పైన నేను ఫిర్యాదు చేయాలనుకోలేదు ఫిర్యాదు చేసి దాని వెనుక పరిగెత్త సమయం తనకు లేదని కానీ అతని ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తున్నానని అపర్ణ బాలమురళి తెలియజేస్తోంది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో కాలేజీ యాజమాన్యం స్పందించినట్లుగా తెలుస్తోంది. అలా అనుచితంగా ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఒక వారం రోజులపాటు కాలేజీ యాజమాన్యం వారిని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే హీరోయిన్ కు క్షమాపణలు చెబుతూ లేఖను కూడా విడుదల చేశారు..లా కాలేజీ ఈవెంట్లు నటి కి వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఈ ఘటన చాలా దురదృష్టమైనది ఈ ఘటన జరిగినప్పుడు యూనియన్ తరపున ఒక వ్యక్తి క్షమాపణలు కోరాడు ఆమెకు ఎదురైన ఇబ్బంది కరగటం క్షమాపణలు కోరుతున్నామంటూ తెలియజేశారు. తన్కమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా కాలేజ్ లోకి సందర్శించినట్లు సమాచారం.
Unbelievable and disgusting! https://t.co/Ls4y06QrVx
— Manjima Mohan (@mohan_manjima) January 19, 2023