సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు అంతకుమించి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా.. చాలామంది ఆయన సన్నిహితులు ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. గొప్ప టెక్నీషియన్ అయినా సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున సంపాదన కలిగి ఉన్నారు. ఇండస్ట్రీకి ఎన్నో పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాలతో కూడా వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు. ఇకపోతే మొదటి భార్య ఇందిరా దేవి మాత్రమే కాకుండా ఆయనకు విజయనిర్మల కూడా భార్య అవ్వడం వల్ల ఆయన ఆస్తులు విషయంలో తగాదాలు వచ్చాయి అంటూ పుకార్లు బాగా వైరల్ అయ్యాయి.
కృష్ణ ఆస్తుల విషయంలో ఎప్పుడూ కూడా తగాదాలు రాలేదు. కృష్ణ ఇంకా ఆస్తిని కొన్ని సంవత్సరాల క్రితమే పనిచేశారు. పెద్దబ్బాయి రమేష్ బాబు అలాగే చిన్నబ్బాయి మహేష్ బాబుకు కూడా సమానంగా వాటాలు ఇవ్వడంతో పాటు కూతుర్లకు కూడా కొంత మొత్తంలో ఆస్తిని కృష్ణ ఇచ్చారట. ఆయన చనిపోయిన సమయంలో ఆయన నివాసం ఉన్న ఇల్లు మాత్రమే చర్చనీ అంశంగా మారింది. ఆ ఇల్లు విజయనిర్మల కొడుకు నరేష్ కు చెందినదిగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇంటి విషయంలో ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందుకే వివాదం అనేది లేకుండానే ఆస్తుల విషయాలు తేలిపోయాయి. ముఖ్యంగా కృష్ణ సోదరుడు ఈ విషయాలను చక్కబెట్టారు అని కూడా సమాచారం అందుతుంది.
మహేష్ బాబు కూడా భారీ ఎత్తున సంపాదిస్తున్నాడు. మరొకవైపు నరేష్ కి కూడా భారీగా ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఆ ఇంటి కోసం గొడవ పడాల్సిన అవసరం లేదని కూడా ఆ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరొకవైపు రమేష్ బాబు కూడా వ్యాపారాలతో పెద్ద ఎత్తున సంపాదించి కుటుంబానికి అందించి ఆయన కూడా చనిపోయారు. కాబట్టి వారి కుటుంబంలో కృష్ణ ఆస్తికి సంబంధించి ఎటువంటి తగాదాలు లేవు అని స్పష్టం చేశారు కుటుంబ సభ్యులు.