బుల్లితెరపై టాక్ షోలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే .ఈ మధ్య ముఖ్యంగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి పాపులారిటీ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్లో కాఫీ విత్ కలర్ లాంటి షోలు కూడా వస్తూనే ఉన్నాయి.అప్పట్లో ఎక్కువగా మంచు లక్ష్మి చేసిన టాక్ షో అందరికీ గుర్తు ఉండనే ఉంటుంది. లక్ష్మీ స్ టాక్ షో పేరుతో ఈ షో అప్పట్లో మంచి సక్సెస్ అయ్యింది. అలాగే ప్రేమతో మీ లక్ష్మి అంటూ కూడా మరొకటాక్ షో చేసింది ఈమె.
మంచు లక్ష్మి కి వచ్చిన తెలుగు భాషతోనే బాగానే ఈ షోలను సక్సెస్ గా రన్ చేసింది. అయితే ఇటీవల టాక్ షో లకు మరింత డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మంచు లక్ష్మీ మాత్రం తన షోలను ఆపివేయడం జరిగింది. ఆమె టాక్ షో ఆపివేయడానికి గల కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. చాలామంది సెలబ్రెటీ గెస్ట్ గా రావడానికి ఇబ్బంది పడుతూ ఉండడంతో మంచు లక్ష్మి తన టాక్ షోను ముందుకు తీసుకువెళ్ల లేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన స్నేహితులు మాత్రం అందరూ షోకి వచ్చారని షో కొనసాగించాలంటే చాలామంది సెలబ్రిటీస్ సైతం ఒప్పుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో జరగబోయే అంటూ మంచు లక్ష్మి తెలిపింది.
అందుకు ఉదాహరణగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. భాగమతి సినిమా సమయంలో అనుష్క టాక్ షో కి రావడానికి ఒప్పుకుంది.. కానీ ఆమె భాగమతి ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వెళ్లడంతో తన ఫోన్ ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉందని తెలిపింది. దీంతో రెండు రోజులపాటు ఆమె అందుబాటులో రాలేదట. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడడంతో మెసేజ్లు, కాల్స్ చేయగా తిరిగి ఇంటికి వచ్చిన అనుష్క వాటిని చూసి షాక్ అయిందట. నేను వస్తానని చెప్పిన అన్నిసార్లు ఎందుకు కాల్ చేసావ్ అని లక్ష్మిని అడిగిందట. దీంతో తనకు ఏర్పడిన భయాన్ని అనుష్కతో పంచుకుందట మంచు లక్ష్మి ఇక ఇలాంటి సంఘటనలను ఎక్కువగా తీసుకోవడానికి తన ఇష్టం లేకనే టాక్ షో మానేసినట్లుగా తెలిపింది మంచు లక్ష్మి.