తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పడంతో అభిమానుల సైతం కాస్త హర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఇక అనసూయ జబర్దస్త్ షోకు యాంకర్ గా కెరియర్ ప్రారంభం మొదలయ్యింది. ఈ పాపులారిటీతోనే అనసూయ ఎన్నో చిత్రాలలో అవకాశాలను కూడా అందుకుంది. జబర్దస్త్ షో అనసూయ కెరియర్లో ఎంతో ప్లస్ అయిందని చెప్పవచ్చు.. అయితే సినిమా ఆఫర్లతో బిజీగా ఉండడం చేత జబర్దస్త్ విషయంలో కాస్త వెనక్కు తగ్గినట్లుగా అనసూయ చెప్పుకొచ్చినట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు నమ్మశక్యంగా లేవని కొంతమంది నేటిజన్లు తెలియజేయడం జరిగింది.
అయితే సినిమా షూటింగ్లో అయిపోయిన తర్వాత అనసూయ జబర్దస్త్ షూటింగ్లో అనసూయ కనిపిస్తుందని అభిమానులు చాలా ఆశాజనకంగా ఎదురు చూశారు.. అనసూయ మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో అనసూయ పూర్తిగా జబర్దస్త్ కు దూరం అయిందని నిర్ధారణకు వచ్చారు అభిమానులు. అయితే అందుకు కారణం పుష్ప -2 సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తూ ఉన్నందువలన ఈమె జబర్దస్త్ కు దూరం అయిందని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా అనసూయ రోజుకి రెమ్యూనరేషన్ కింద రూ.3 నుంచి రూ.5 లక్షల రూపాయలు రేంజ్ లో తీసుకుంటుందని సమాచారం.
అనసూయ ప్రస్తుతం వరుస ప్రాజెక్టుగా బిజీగా ఉంటోంది. అయితే అనసూయ జబర్దస్త్ మానేయడానికి ముఖ్య కారణం తమ కుమారులే అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు తెలుస్తోంది.తమ కొడుకులను చూసుకునే విషయంలో ఇబ్బంది పడుతూ ఉండడంతో తాను జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పాననే విషయాన్ని తెలియజేసింది. జబర్దస్త్ షో వల్ల పిల్లలతో టైం ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతున్నారని అందువల్లే వాటికి గుడ్ బై చెప్పేసానని తెలిపింది.