సినీ పరిశ్రమలో డైరెక్టర్‌గా ఎంతో గుర్తింపు పొందిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శృతిహాసన్, బాలకృష్ణ హీరో హీరోయిన్లు నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా.. ఈయన వేదికపై శృతిహాసన్ కు ఐ లవ్ యు చెప్పడం పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యింది. అయితే ఈయన ఏ ఉద్దేశంతో తనకు ఐ లవ్ యు చెప్పారనే విషయం శృతిహాసన్ కి చెప్పినట్టుగా వీరిద్దరూ గురించి పెద్ద ఎత్తున పలు మిమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి.
ఇక సోషల్ మీడియాలో ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే తాను రిజెక్ట్ చేసిన విధంగా వీరిద్దరి గురించి మిమ్స్ వైరల్ గా మారుతున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా గోపీచంద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు శృతిహాసన్ తో ఉన్నటువంటి రిలేషన్ గురించి బయట పెట్టడం జరిగింది. శృతిహాసన్ తో కలిసి ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశానని తెలిపారు. హీరోయిన్గా బలుపు ,క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలు మాత్రమే చేసామని..
ఆమెతో నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ మాత్రమే ఉందని గోపీచంద్ తెలిపారు. అదే విషయాన్ని వేదికపై తనకు చెప్పడంతో సోషల్ మీడియాలో మా ఇద్దరి మధ్య ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే లవ్ స్టోరీ గా మార్చి వైరల్ గా చేశారని తెలిపారు. కానీ ఈ ఫన్నీ మిమ్స్ చూసి మేమిద్దరం తెగ నవ్వుకున్నామని తెలిపారు గోపీచంద్. శృతిహాసన్‌తో వచ్చినటువంటి లవ్ ఫెయిల్ గురించి క్లారిటీ ఇచ్చారు.