టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో బిజీగా ఉంటోంది. ఇటీవలే సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనిపించుకుంది. ఇక బాలీవుడ్లో ఈనెల 20వ తేదీన మిషన్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గడిచిన కొన్ని రోజులుగా సినిమాల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. హీరోలు హీరోయిన్స్ సినిమా వాళ్ళని ట్రోల్ చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ విషయంపై రష్మీక పై కూడా చాలా సార్లు ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ రష్మిక చేసిన వ్యాఖ్యలకు రష్మిక సినిమాలకు సంబంధించి ఆమెపై ట్రోల్స్ వినిపిస్తూ ఉంటాయి. దీంతో ఈ ట్రోల్స్ పైన సీరియస్ అయ్యింది రష్మిక..
రష్మిక మాట్లాడుతూ చాలా వరకు నేను మౌనం గానే ఉంటాను మొదట్లో తనపైన చాలా ఎక్కువగానే ట్రోలింగ్స్ వచ్చాయి.. అయినా కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ప్రేక్షకులపై నాకున్న గౌరవం అద.. నా మీద విమర్శలు చేసే వాళ్ళు ఫేక్ వార్తలు రాసే వాళ్ళు చాలామందే ఉన్నారు. అవేమీ నన్ను ఇబ్బంది పెట్టవు నేను వాటి గురించి అసలు ఆలోచించను.. కానీ ఇప్పుడు అవి శృతి మించి తన కుటుంబం తన చెల్లిని ఇబ్బంది పెడుతున్నాయని తెలుపుతోంది. అందుకే నేను వాటిని జీర్ణించుకోలేకపోతున్నాను.. ముఖ్యంగా తన చెల్లి మానసిక ఆరోగ్యం పై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందుకే తన మీద వచ్చిన పట్టించుకోను కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకోనని తెలియజేస్తోంది. దీంతో రష్మిక సీరియస్ గా మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.