నాటు నాటు పాటకి స్టెప్పులు వేసిన రామ్ చరణ్ అత్త..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో RRR సినిమా ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ మరింత పాపులారిటీ అవుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ కి విశేషమైన ఆదరణ లభించింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఇండియా సాంగ్ నాటు నాటుగా గుర్తింపు పొందడం జరిగింది. ఈ అవార్డు రావడం పై దేశం మొత్తం ప్రశంసలు కురిపిస్తున్నారు చిత్ర బృందం పై. ఇక ఈ సాంగ్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్స్ పర్ఫామెన్స్ కీరవాణి మ్యూజిక్ రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జీతో పాడిన విధానం అందరికీ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు.

రామ్ చరణ్ పాటకి వీధుల్లో స్టెప్పులేసిన ఉపాసన తల్లి (వీడియో)

ఈ కారణంగా ఈ పాట విశేషమైన ఆదరణ రావడంతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులోని సాంగ్కు స్టెప్పులెస్తు ఉన్నారు . ఇండియన్ మాస్ లో ఉండే ఉపూ ఈ సాంగ్లో ఉండడంతో తెలియకుండానే పాట వచ్చినప్పుడు ఈ స్టెప్పులు వైరల్ గా మారాయి. తాజాగా ఈ సాంగ్ కి రామ్ చరణ్ అత్త ఉపాసన తల్లి శోభన కామినేని స్టెప్ వేయడం జరిగింది. దావోస్ బిజినెస్ సమ్మిట్ లో ఈమె జర్నలిస్టుతో కలిసి ముచ్చటించడం జరిగింది.

Ram Charan: అల్లుడి పాటకు స్టెప్పులేసిన అత్త.. లవ్ యూ అన్న కూతురు - NTV  Telugu

ఈ సందర్భంగా ఆమె కోరిక మేరకు నాటు నాటు పాటకి స్టెప్పులు వేయడం జరిగింది. ఇది ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ గా మారుతోంది. తాను ఎక్కడికి వెళ్లినా ఈనాటి నాటు పాట గురించి అడుగుతున్నారని ఈ సందర్భంగా శోభన కామినేని తెలియజేయడం జరిగింది అలాగే ఈ పాటలు రామ్ చరణ్ ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలియజేస్తోంది. ఇక ఈ వీడియోను ఉపాసన రాంచరణ్ షేర్ చేశారు.

Share.