రాజమౌళి మహాభారతం వచ్చేది అప్పుడేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ దర్శకుల్లో దిగ్గజ ధీరుడు రాజమౌళి ఎన్నో విభిన్నమైన సినిమాలను తీసుకొస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు మహాభారతం అనే సినిమాను తీయడానికి ముందు తనకు తాను పెట్టుకున్న పరీక్షల ఒక ట్రయల్ గా చెబుతూ వస్తున్నాడు రాజమౌళి . ఆర్ ఆర్ ఆర్, ఈగ, మగధీర, బాహుబలి వంటి సినిమాలు తీసినప్పుడు జక్కన్నకి మహాభారతం తీయడం పెద్ద కష్టమేమీ కాదు. మహాభారతం తీయటానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం అవసరం అవుతుందని రాజమౌళి చెప్పాడు. కానీ ఆ పదేళ్లు పూర్తవటానికి సమయం దగ్గర పడుతున్న మహాభారతం ఊసు ఎత్తటం లేదు.

1,000Cr Investment in Non-Rajamouli Mahabharata! | Honeysoftsolutions.net

ఇప్పటికే భారతీయ వెండితెరపై.. బుల్లితెరపై మహాభారత కథ ను చూసినప్పటికీ రాజమౌళి ఈ కథను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయితే అయింది.. కానీ దానివల్ల ఒక మంచి జరిగిందని చెప్పాలి. ఇక ఆయన చేసే ప్రాజెక్టులను భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయికి చేరింది. హాలీవుడ్ ప్రేక్షకులు ఆయన పేరు ఎత్తితే చాలు ఊగిపోతున్నారు. ఈ మధ్యకాలంలో RRR సినిమాలో నాటు నాటు పాటకి అమెరికాలో అవార్డులు కూడ అందుకున్నది. రాజమౌళి తీస్తున్న మహాభారతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్ళు ఆదరించడానికి అవకాశం దక్కింది.

మహాభారతం తీయటమే గొప్ప విషయం అలాంటి కథను రాజమౌళి తన విజయంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తే దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. ప్రపంచం కూడా మహాభారతంలోని అంతరార్ధాన్ని అర్థం చేసుకుంటుంది. మహాభారతాన్ని కొన్ని భాగాలుగా తెరకెక్కిస్తే ఆ సినిమాలు పూర్తి చేస్తే జక్కన్న కెరీర్ కు అంతకుమించి కోరిక లేదనే విషయాన్ని ఎన్నోసార్లు తెలియజేశారు..ఈ సినిమాను మహేష్ బాబు సినిమా పూర్తి అవ్వగానే ఈ ప్రాజెక్టు చేయాలని రాజమౌళి అనుకుంటున్నారు.

Share.