ఎమాయ చేసావే సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సమంత. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ సినిమా అనంతరం ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అలాంటి సమయంలోనే నాగచైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుంది సమంత. కానీ కొన్ని కారణాల చేత నాలుగు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి సమంత ఎక్కువగా తన సినిమాల మీద ఫోకస్ చేస్తూ వస్తోంది. గత ఎడారి యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
శాకుంతలం సినిమా వచ్చే నెల 17వ తేదీన సినిమా విడుదల కాబోతోంది. అయితే సమంత కు సంబంధించి ఒక విషయంలో స్టార్ హీరోలు సైతం భయపడుతున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమంత నటించిన ఈ చిత్రానికి దిల్ రాజ్ మరియు చిత్ర బృందం ప్రమోషన్లలో చాలా వేగంగా పాల్గొంటున్నారు. అయితే ధనుష్ హీరోగా నటించిన సర్ సినిమా కూడా ఆ సమయంలోనే విడుదల కాబోతోంది. అంతేకాకుండా విశ్వక్ నటిచ్చిన దమ్కీ సినిమా కూడా అదే సమయంలో విడుదల కాబోతోంది. వీటితో పాటే కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు కథ సినిమా కూడా ఆ సమయంలో విడుదల కాబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి అధికారి ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాతో ఇప్పటికే ఇద్దరు యంగ్ హీరోల సినిమా విషయంలో భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి గాను తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సమంతకు పోటీగా వారి సినిమాలు విడుదల చేస్తే యంగ్ హీరోల సినిమా చూసే ప్రసక్తి లేదని భావించి యంగ్ హీరోలు కూడా వారి సినిమాలను మార్చి లో విడుదలచేయబోతున్నట్లు సమాచారం.