ఆది పురుష్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు పొందుతున్న ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తోంది. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయిపోయి ఎన్నో రోజులు కావస్తున్న కేవలం VFX కారణంగా ఈ సినిమా ఆలస్యం అవ్వడం జరుగుతోంది. గడిచిన కొన్ని నెలల క్రితం ఈ సినిమా టీజర్ విడుదల చేయక ఈ టీజర్ పైన కూడా విమర్శలు రావడంతో మరొకసారి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి VFX మార్చే పనిలో పడ్డారు మేకర్స్.

Adipurush teaser: Prabhas' Lord Ram gets ready to battle Saif Ali Khan's  Lankesh in a jerky CGI fest | Entertainment News,The Indian Express

అందుచేతన సంక్రాంతికి విడుదల కావలసిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల కాదని అనుమానాలు ప్రభాస్ ఆభిమానులలో కదులుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల పైన క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తేదీన విడుదల చేయడం ఖాయమంటూ నిర్ధారిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు టి సిరిస్ సంస్థ.

అందుకు సంబంధించి ఒక ట్విట్టర్ కూడా వైరల్ గా మారుతోంది. ఒక పోస్టర్ తో ప్రభాస్ రాముడు గా కనిపించగా.. ఆ వెంటనే 150 రోజులు ఆగాల్సిందే అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

Share.