జూనియర్ సమంత గా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఆషురెడ్డి. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. ఎప్పుడూ కూడా తన అందచందాలతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు ఫోటోలతో కుర్రకారులను ఆకర్షించేలా చేస్తూ ఉంటుంది. దీంతో రెండు సార్లు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని సంపాదించుకుంది.
అలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా బాగా ఫేమస్ అయిన ఆషురెడ్డి కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేసింది. అలాగే పలు చిత్రాలలో కూడా నటించే అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ మా లో బిబి జోడి అంటూ సరికొత్త డాన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కేవలం బిగ్ బాస్ లో పాల్గొన్నటువంటి కంట్రీ పాల్గొంటూ ఉంటారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆషురెడ్డి మెహబూబా కు జోడిగా ఉన్నారు. అయితే ఫస్ట్ ఎపిసోడ్లో తనతో కలిసి పెర్ఫార్మషన్ చేసిన ఈమె రెండు ఎపిసోడ్ కు తనకు హాండ్ ఇచ్చేసింది. దీంతో మెహబూబా సింగల్ గానే డాన్స్ పెర్ఫార్మషన్ చేయవలసి వస్తోంది.
దీంతో ఆషురెడ్డికి అనారోగ్యం బాగాలేదని అందువల్లే తాను రాలేకపోయానని తెలియజేస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆషురెడ్డి విదేశాలలో మాత్రం తిరుగుతూ కనిపిస్తోంది. అలాగే వాల్తేర్ వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు కూడా హాజరయ్యింది. అయితే ఇలా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నప్పటికీ ఈమె బిగ్ బాస్ జోడి కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేకపోతోంది. దీంతో ఈమె పైన ట్రోలింగ్ జరగడం జరిగింది.. తన గురించి వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన ఈమె.. అనారోగ్య సమస్యల కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని దాదాపుగా నెల రోజులపాటు కోలుకోవడం కష్టమని చెప్పడంతో ఆ షో నుంచి తప్పుకున్నానని తెలిపింది. అలాగే ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి. ప్రతి ఒక్కటి షేర్ చేసుకోలేము కదా అంటూ తెలియజేసింది.