తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి స్నేహితులుగా పేరుపొందారు. అయితే కొన్ని రాజకీయ కారణాల చేత వీరిద్దరి మధ్య పలు విభేదాలు వచ్చాయనే వార్తలు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని పలు సందర్భాలలో తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇక కమెడియన్ ఆలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా పదవిని ఇవ్వడం జరిగింది.
దీంతో చురుకుగా ఆలీ రాజకీయాలలో పాల్గొంటూ తనతైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆది పవన్ పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది .పవన్ అభిమానులకు ఈ విషయం వినగానే షాక్కు గురైనట్లు తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వం నిర్ణయిస్తే తను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమే అంటూ ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం అంటూ కూడా తెలియజేశారు. ఇక తనపై ఎవరైనా విమర్శలు చేసినట్లు అయితే మంత్రి రోజా గారు అసలు తగ్గరని ఆవిడ వేరే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చారు ఆలీ.
ఇక పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ సిద్ధమే అంటూ ఆలీ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆలీ సినిమాలకు, షోలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. 2024 ఎన్నికలలో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం పవన్, ఆలీ మధ్య దూరం పెరుగుతూ ఉండడంతో కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ పై పోటీ చేయాలనుకున్న నిర్ణయం ఆలీకి సరైనదా కాదా అనే విషయం అభిమానులలో సందిగ్ధతను నెలకొనెల చేస్తోంది.