వారందరిపై గట్టి కౌంటర్ వేసిన రోజా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిరోజుకి చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్నవారు నుంచి మొదలుకొని చిన్నచిన్న స్కిట్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో పాపులారిటీ కోసం తపన పడుతున్న జబర్దస్త్ కమెడియన్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. గత కొద్దిరోజులుగా జబర్దస్త్ కమెడియన్స్ అయినటువంటి గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి వారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ రోజా పైన పెను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Jabardasth Getup Srinu: జబర్దస్త్‌లో గెటప్ శ్రీనును టీమ్ లీడర్ కాకుండా  తొక్కేసిందెవరో తెలుసా..? | Jabardasth Comedian Getup Srinu not became team  leader just because of him and here the behind ...

అయితే అలా గెటప్ శ్రీను, హైపర్ ఆది, రోజా గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై తాజాగా రోజా దిమ్మ తిరిగే కౌంటర్ వేసింది.. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ కాంపౌండ్ లో 6 మంది హీరోలు ఉన్నారు.. వారి పాపులారిటీ కోసం ఇలా చిన్నచిన్న ఆర్టిస్టులతో జబర్దస్త్ కామెడీ చేయిస్తున్నారని రోజా విమర్శిస్తోంది. మెగా హీరోల మందన వందనం కోసం వేషాల కోసం వీళ్లు కూడా తమ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రోజా మండిపడుతోంది. పొలిటికల్ అజ్ఞానులు జోకర్లు తనపై చేసే విమర్శలు తాను పెద్దగా పట్టించుకోనంటూ కూడా కౌంటర్ వేస్తోంది.

రోజాపై ఆది అసభ్యకర వ్యాఖ్యలు: షాక్‌లో నెటిజన్లు | Jabardasth hyper aadi  objectionable comments on ycp mla roja | TV9 Telugu

ఏపీ టూరిజం మినిస్టర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం 18వ స్థానానికి పడిపోయిందని నాగబాబు అజ్ఞాతంతో మాట్లాడుతున్నారని కౌంటర్ వేసింది.శ్రీకాకుళం సభలో హైపర్ ఆది మంత్రి రోజా గురించి మాట్లాడుతూ మంత్రుల శాఖ గురించి తెలియదు అంటూ ఈయన సెటైర్లు వేయడం జరిగింది. దీంతో రోజా మిడతలు, ఉడతలు గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ఈ సందర్భంగా తెలియజేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share.