బాలయ్య కంటే చిరంజీవి మార్కెటే ఎక్కువా.. కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వీరిద్దరే అగ్ర హీరోలుగా కొనసాగిస్తున్నారు .అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ వీరిద్దరి పేర్లు టాలీవుడ్లో ఎప్పటినుంచో ముందు వరుసలో ఉన్నాయి. ఇక వీళ్లిద్దరూ తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళలాంటి వారనే చెప్పాలి. ఇక వారి కెరీర్ లో ఎన్నో విజయాలలో రికార్డులను సాధించారు. ఇక చిరంజీవి కెరీర్ లో 150 పైగా సినిమాలలో నటించారు. ఇక బాలకృష్ణ అయితే 100 కు పైగా సినిమాల్లో నటించి ఎవరు స్టార్డమ్ వారిదే అన్నట్టు వ్యవహరిస్తారు. ఇన్నేళ్లుగా ఏ ఒక్కరి స్టార్ డం లో క్రేజ్ లో మార్పులు రాలేదు.

No entry for 'Chiru, Balayya and Nag at shoots?

కానీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల వలన ఇద్దరీ హీరోల మార్కెట్లను కంపేర్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులు ఒకప్పుడు సినిమాలను ఆదరించిన తీరే వేరు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండు వేరు.. ఒకవేళ ఇద్దరు సినిమాలు ఒకేసారి విడుదలైన ఎవరు మార్కెట్ వారిదే. రెండు సినిమాలు పెద్దహిట్ కావాలని కోరుకునే వారెందరో.. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో, అలాగే కలెక్షన్స్ లో కూడా వ్యత్యాసం చూస్తున్నారు.

ఏ హీరో జీవితంలో అయినా హిట్స్, అలాగే ఫ్లాప్స్ అనేది సహజం. ఒకప్పుడు చిరంజీవి తీసిన చాలా సినిమాలు ఓ రేంజ్ లో ఆడాయి. కొన్ని ప్లాపులు కూడా ఉన్నాయి. బాలకృష్ణ కూడా కొన్ని ఫ్లాపులను చవిచూశాడు. కానీ కొన్నాళ్ళకి మాస్ సినిమాలతో హీరోగా బాలయ్య ఫామ్ లోకి వచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ మాస్ హీరోలుగా బిగ్గెస్ట్ హిట్స్ చూశారు. ఈ క్రమంలో క్రేజ్ పరంగా బాలయ్యే పై చేయి అయినా మార్కెట్ పరంగా చిరునే టాప్ లో ఉండటం విశేషం వీరిద్దరిని కంపేర్ చేయడానికి లేదు.

మరోవైపు చిరు తొమ్మిదేళ్ల గ్యాప్ లో వచ్చిన ఆయన మార్కెట్ ఇంకా పెరుగుతూ ఉంది. కానీ ఎక్కడ తగ్గలేదు. అందుకు నిదర్శనంగా వాల్తేరు వీరయ్య.. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలే ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడొచ్చినా చిరంజీవి సినిమాకి రూ.89 కోట్ల బిజినెస్ కాగా.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాకి రూ.74 కోట్లు వచ్చాయి.

Share.