కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలని డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. స్నేహితుడు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు విజయ్ . ఎటువంటి సినిమా తీసిన అందులో విభిన్నమైన కథను ఎంచుకొని సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఆయన ఎలాంటి పాత్రలో నటించిన తనకంటూ ఒక మార్కు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు.ఇంకా ఈమధ్య విజయ్ సినిమాలన్నీ యావరేజ్గా హిట్ ఖాతాలోకి వెళ్తున్నాయి. సంక్రాంతికి వచ్చిన వారసుడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేకపోయింది.
ఇక తమిళనాడులో విజయ్ నెంబర్ వన్ హీరో గా ఉన్నారు. విజయ్ సినిమాకు రెమ్యూనరేషన్ బాగానే తీసుకుంటాడు. సినిమా సినిమాకి విజయ్ రెమ్యూనరేషన్ అంతకంతకు పెరుగుతోంది. ఇంకా ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ .445 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఇక ఆయన ఒక్కో సినిమాకి దాదాపు రూ .100 కోట్లు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక సౌత్ ఇండియాలోనే భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలలో విజయ్ ఒకరుగా నిలిచారు. ఇక విజయ్ పై నెగిటివ్ వార్తలను స్పందించటానికి కూడా ఆయన ఎక్కువగా ఇష్టపడరు.విజయ్ సినిమాలు అడపాదడపా ఆడుతున్నా కూడా ఆయనకి వరుసగా సినిమా అవకాశాలు వస్తూ బిజీగా ఉన్నారు. ఇంకా రాజకీయాల ఎంట్రీ కి సంబంధించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి ..ఆ వార్తలను విజయ్ ఎక్కువగా పట్టించుకోవడం లేదు.
విజయ్ సినిమాలు అంతగా హిట్ ను సాధించకపోయినా ఇతర హీరోలతో గట్టి పోటీ ఇస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత ఎదిగిన విజయ్ ఒదిగి ఉంటారని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఇక టాలీవుడ్లో రీమిక్స్ సినిమాల్లో నటించి తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుత విజయ్ దళపతి ఆస్తి వైరల్ గా మారుతోంది.