గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి స్టార్ హీరోయిన్ తమన్నా పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ వీటిని మాత్రం తమన్నా కొట్టి పారేస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సందడి చేసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా గోవాలో తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి అక్కడ రచ్చ చేయడంతో అక్కడి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి తమన్నా తన ప్రేమ వ్యవహారం బయటపడిందని విషయం వైరల్ గా మారుతోంది.నిన్నటి రోజున ముంబైలో నిర్వహించిన ఎల్లే అవార్డు ఫంక్షన్ లో నటుడు విజయ్ వర్మతో కలిసి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అదిరిపోయే ఔట్ ఫిట్ తో ఈ జంట కనిపించడంతో ప్రతి ఒక్కరూ కూడా వావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగానే తమన్నా విజయ్ వర్మలు కలిసి ఈవెంట్ కు హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే వీరిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్ళినట్లుగా కూడా మరికొన్ని వార్తలు మహిళలుగా మారుతున్నాయి.
ఈ అవార్డు ఫంక్షన్ లో విజయ్ ,తమన్నా స్టైలిష్ గా ఫోటో గ్యాలరీలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య బాగా సన్నిహిత్యం ఉందని వీరి లవ్ కన్ఫర్మ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన ఇప్పటివరకు తమన్నా గాని విజయవర్మ గాని ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.