తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2008వ సంవత్సరంలో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం నేనింతే. ఈ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సియా గౌతమ్. ఇమే అసలు పేరు అదితి గౌతమ్. కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఈమె పేరును మార్చుకుంది. నేనింతే సినిమాలో సందే అనే పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేసింది.
ఇక ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో నటించిన సియా గౌతమ్. అయితే ఈ సినిమా సక్సెస్ ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు.దీంతో మరికొన్ని అవకాశాలు రాలేకపోయింది. అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం లేకపోవడంతో ఈమె తెలుగులో మళ్లీ కనిపించలేదు. అయితే 2011లో కన్నడలో ఒక సినిమాలో చేసినట్టుగా తెలుస్తోంది. సుమారుగా ఏడేళ్ల తర్వాత బాలీవుడ్లో సంజు అనే సినిమాలో అవకాశం అందుకుంది. దీని తర్వాత ఈమెకు ఆఫర్లు కనుమరుగయ్యాయని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించి ఎలాంటి విషయాన్నైనా సరే షేర్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్లు సమాచారం. అలాగే ముంబైలో తన కుటుంబంతో కలిసి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.ఇక అక్కడే తమ కుటుంబానికి సంబంధించిన పలు బిజినెస్ లు చూసుకుంటున్నట్లు సమాచారం.సమయం దొరికినప్పుడల్లా సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది అన్నట్లుగా తెలుస్తోంది ఇక గత సంవత్సరం గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ చిత్రాల్లో ఒక చిన్న పాత్రలో నటించింది.
View this post on Instagram