బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇది సినిమా మొదటి రోజునే సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచ కోత కోసింది. కానీ తర్వాత కాస్త స్లోగా డౌన్ అయిందని వార్తలు వినిపించాయి. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ పరంగా ప్రతిరోజు బాగానే దూసుకుపోతోంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఏకంగా రూ.59 కోట్లకు పైగా క్రాస్ వసూలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.73.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాలలో మరొకసారి కలెక్షన్లతో ఊచకోత కోస్తోంది అన్నట్లుగా తెలుస్తోంది.రూ.11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుని అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ .12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకొని అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్నిచోట్ల ఆఫ్లైన్ టికెట్లు సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం నాలుగు రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో రూ.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేసుకున్నట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.86 కోట్ల రూపాయల మార్పును అందుకోబోతుందని చెప్పవచ్చు బాలయ్య కెరియర్ లో ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఎంతటి కలెక్షన్ల రాబడుతుందో చూడాలి.