తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా క్రేజ్ సంపాదించిన వారిలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఒకరు. కమెడియన్ గా చేస్తూ టాప్ కమెడియన్ గా పేరు సంపాదించారు. ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తూ కమెడియన్క బాగానే పేరు సంపాదించడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తో పరిచయం బాగా ఏర్పడడంతో గడిచిన రెండు రోజుల క్రితం జనసేన యువశక్తి అనే పేరుతో ఒక సభను కూడా నిర్వహించారు.
ఈ సభకు హైపర్ ఆది కూడా వచ్చి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు హైపర్ ఆది అడుగులు రాజకీయాల వైపు వెళ్ళనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.మెగా ఫ్యామిలీకి వీర అభిమాని అయిన హైపర్ ఆది జనసేన పార్టీలోకి వెళ్లారని సంకేతాలు అందుకు ఉదాహరణ అంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ ప్రచారానికి హైపర్ ఆది చాలా ఉత్సాహం చూపించడమే కాకుండా పవన్ కళ్యాణ్ నుండి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్నారని కొంతమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు.
అందుకే జనసేన సభలకు హాజరవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి కొంతమంది హైపర్ ఆది అడగక పోయిన జనసేన తరఫున పవన్ కళ్యాణ్ హైపర్ ఆదికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది చేజేతులారా హైపర్ ఆది తన కెరీరని రాజకీయాల్లోకి వెళ్లి నాశనం చేసుకుంటున్నారని కామెంట్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీల సైతం రాజకీయాల వైపు వెళ్లి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి హైపర్ ఆది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.