అందుకే కృష్ణ- శోభన్ బాబు మూవీ ఆగిపోయింది..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరోలలో ట్రెండ్ సెట్ చేసిన హీరోలలో కృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఈయన నటించిన ఎన్నో కుటుంబ చిత్రాలు ఉన్నాయి. కృష్ణ మల్టీస్టారర్ సినిమాలను దాదాపు అందరూ హీరోలతో చేశారు. ఆయన నటించిన గూడచారి సినిమా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు అభిమానులను సంపాదించేలా చేసింది. మరొక హీరో శోభన్ బాబుతో ముందడుగు, మండే గుండెలు సినిమాలు చేసి హిట్టును సాధించారు. అయితే ఒక సినిమాలో వీరిద్దరూ కలిసి నటించాలనుకుని చివరికి శోభన్ బాబు గారు నిరాకరించారు. ఆ సినిమాని కృష్ణ గారే సోలోగా పూర్తి చేశారట.

Krishnarjunulu Telugu Movie Songs - Krishnarjunulam - Krishna, Sobhan Babu  - YouTubeఒకప్పుడు శోభన్ బాబు, కృష్ణ మల్టీ స్టారార్ సినిమాలలో కలిసి నటించారు. ఇద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్లను పొందాయి. అయితే వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమాతో తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు శోభన్ బాబు .ఆ సినిమా పేరు మహాసంగ్రామం.. ఈ సినిమా తో మల్టీస్టారర్ సినిమాతో చేయకూడదని అనుకున్నారటశోభన్ బాబు. ఆ పాత్రలో శోభన్ బాబు పాత్ర చాలా తక్కువ ఉందని అభిమానులు గొడవ చేయటంతో ఇకపై అలా నటించకూడదని శోభన్ బాబు అనుకున్నారట.అయితే కృష్ణ, శోభన్ బాబు గారు మంచి స్నేహితులుగా సన్నిహితంగా ఉండేవారు.

శోభన్ బాబు గారికి ఉన్న మంచి అలవాటు వల్ల తను సంపాదించిన ప్రతి రూపాయిని భూమిపై పెట్టుబడి పెట్టేవారని సమాచారం. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కృష్ణ గారికి కూడా చెప్పేవారట. అయితే కృష్ణ గారు ఆయన మాటలను వినలేదట. సినిమాల్లో పెట్టుబడి పెడితే నష్టాలని చూస్తారని ఎప్పుడూ తిట్టేవారట శోభన్ బాబు కృష్ణ గారిని.. ఈ విషయం స్వయంగా కృష్ణ గారే శోభన్ బాబు మరణించినప్పుడు చెప్పారు. కృష్ణ గారు గతేడాది మరణించిన విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించటంతో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు.

Share.