తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో పవన్ కళ్యాణ్ పేరు వినగానే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతోంది అంటే చాలు అభిమానులు ఇక ఎంతో కోలాహలం చేస్తూ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక గాసిప్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చి హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరిద్దరికీ కూడా సంతానం కలగాక పలు విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న పవన్ కళ్యాణ్ రష్యా కు చెందిన అన్న లేజినోవాను మూడో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. వీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అన్న లేసినోవా.. విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాని తెగ వైరల్ గా మారుతున్నాయి. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ మూడో భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అనే వార్తలు చాలా ట్రెండీగా నిలుస్తున్నాయి.
ఈ వార్తలు పవన్ సన్నిహితులు మాత్రం కొట్టి వేస్తున్నారు.ఇదంతా కేవలం కొంతమంది కావాలని ఇలాంటి పనులు చేస్తున్నారని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెప్పడంలో ఆరితేరిన వేణు స్వామి మాత్రం షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరలో నాలుగో పెళ్లి అంటూ వేణు స్వామి ఒక బిగ్ బాంబును కూడా పేల్చారు. అది ఎప్పుడైనా అవ్వచ్చు అంటూ తన సంచలన విషయాన్ని తెలిపారు వేణు స్వామి.