టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ లలో ఒకరైన శృతిహాసన్ ఈమధ్య మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చింది. అలా వరుసగా సీనియర్ హీరోలైన బాలకృష్ణ ,చిరంజీవితో కలిసి వరుస సినిమాలలో నటించి సంక్రాంతికి విజయ పతాకాన్ని ఎగరవేసింది. ముఖ్యంగా మెగా హీరోలతో నటించిన సినిమాలు అన్ని కూడా సక్సెస్ బాట నిలుస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ,శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలు సక్సెస్ సాధించాయి.
ఇక అల్లు అర్జున్, శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన రేసుగుర్రం కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక రాంచరణ్, శృతిహాసన్ కాంబినేషన్లో ఎవడు సినిమా విడుదల అవ్వగా మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవితో వాల్తేర్ వీరయ్య సినిమాలో నటించగా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మెగా హీరోలకు శృతిహాసన్ లక్కీ హీరోయిన్గా మారిపోయిందని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. శృతిహాసన్ ఒక్కో చిత్రానికి ప్రస్తుతం రూ.2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటోంది. శృతిహాసన్ రోల్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలు అయితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటోంది.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రభాస్ అభిమానులు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే శృతిహాసన్ కు రెండు వరుస విజయాలు అందుకున్నాయి. దీంతో మరిన్ని అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. శృతిహాసన్ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా యంగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది.