తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గురించి అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే చాలు దేవిశ్రీప్రసాద్ పూనకాలతో పాటలను అద్భుతంగా రూపొందిస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వాల్తేరు వీరయ్య సినిమా గురించి.. చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఇకపోతే ఈ సినిమా మ్యూజికల్ గా చాలా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట హైలైట్ అవ్వడంతో చిరంజీవి గారు నన్ను ప్రశంసించారు. ఇలా చిరంజీవి నుంచి ప్రశంసలు అందుకోవడం కంటే గొప్ప అవార్డు ఏదీ లేదు అంటూ దేవిశ్రీప్రసాద్ తెలిపారు.. అలాగే చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి దూరం అవుతూ రాజకీయాలలోకి వెళ్తున్నారని అనౌన్స్ చేశారు. ఇలా ఇండస్ట్రీకి దూరం అవుతానంటూ చేసిన కామెంట్స్ నన్ను ఎంతగానో బాధపెట్టాయి . ఇంత చిన్న వయసులో ఇండస్ట్రీ కి దూరం కావడం ఏంటి అని బాధపడ్డాను. అంతేకాదు చిరంజీవి సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో పెద్ద పార్టీ కూడా ఇచ్చారు.
అయితే ఆ పార్టీ కి రమ్మని స్వయంగా చిరంజీవి, అల్లు అరవింద్ నాకు ఫోన్ చేసి పార్టీకి రమ్మని పిలిచారు. కానీ ఆయన సినిమాలలో నటించరు .. రాజకీయాలలో కొనసాగుతారని తెలిసి చాలా బాధగా అనిపించింది. తాను ఇండస్ట్రీకి దూరం అవుతూ ఇచ్చిన పార్టీ నాకు ఏమాత్రం నచ్చలేదు అని.. ఇలా ఇండస్ట్రీకి దూరమైతే కూడా పార్టీలు ఇస్తారా అని నేను బాధపడ్డాను. అందుకే చిరంజీవి గారు ఇచ్చిన పార్టీకి వెళ్ళలేకపోయాను అంటూ దేవిశ్రీప్రసాద్ తెలిపారు.