టాలీవుడ్లో స్టార్ యాంకర్లలో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతోంది అనసూయ. గతంలో బుల్లితెర పైన ఎన్నో షోలులో సందడి చేసిన ఈమె ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది .ప్రస్తుతం పలు చిత్రాలలో మాత్రం నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అనసూయ ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తన పైన ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది.
అయితే ఇప్పుడు తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ నుంచి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. తన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని అసలు లెక్కచేయానని వాళ్ల గురించి అసలు పట్టించుకోకపోవడం నా రుగ్మత అంటూ తెలియజేసింది. అనసూయ వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అనసూయ పలు పాజిటివ్ రోల్స్ లో నటిస్తుండగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటిస్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్న అనసూయ ఆ తర్వాత పలు విభిన్నమైన పాత్రలలో నటించింది.
ప్రస్తుతం అనసూయ చేతిలో పుష్ప -2, రంగమార్తాండ సినిమాలతో పాటు.. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా గట్టిగానే ఉన్నది. అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా హీరోయిన్లకు దీటుగా తన అందాలను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యాంకర్ గా అనసూయ కెరియర్ బాగా సాగుతున్న సమయంలో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram