అలా చేస్తే నాతో రావచ్చంటున్నా సమంత

Google+ Pinterest LinkedIn Tumblr +

సమంత అక్కినేని హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ యూ టర్న్ ‘ సమంత ఈ సినిమాలో తొలిసారిగా ఒక పత్రిక విలేకరిగా నటిస్తుంది. ఇక ఈ రోజు సమంత ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఇవాళ తన అఫిషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఒక ప్రోమో వీడియో ని విడుదల చేసింది. అందులో భాగంగా యు టర్న్ సినిమా పోస్టర్స్ ఉన్న ఏదైనా మల్టి ప్లెక్స్ లో ఒక సెల్ఫీ తీసుకుని ట్విట్టర్ లో కానీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా గాని షేర్ చేసి మా చిత్ర యూనిట్ కి పంపండి. అందులో నుండి కొంత మంది లక్కీ విన్నెర్స్ ని సెలెక్ట్ చేసి మాతో పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అఫిషియల్ గా ఇన్వైట్ చేస్తాం అని తెలిపింది సమంత.
ఈ చిత్రాన్ని వి వై కంబైన్స్ నిర్మాణ సంస్థ వారు నిర్మిస్తుండగా శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత గా వ్యవహరించారు. ఈ నెల 17వ తేదీన చిత్ర ఆడియోని వచ్చే నెల సెప్టెంబర్ 13న చిత్రాన్ని విడుదల చేయనున్నామని అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్ సభ్యులు. పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, పూర్ణ చంద్ర తేజస్వి సంగిత్తం అందించారు. రాహుల్ రవీంద్రన్, అది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Share.