టాలీవుడ్ లో హీరోయిన్, మంత్రి రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గడిచిన కొద్ది రోజుల నుంచి ఈమె పైన పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులు సైతం ఫైర్ అవుతూ ఉన్నారు. అయినా కూడా రోజా ఎక్కడ భయపడకుండా వారికి దీటుగానే సమాధానాలను ఇస్తూ వస్తోంది. ఇక మరికొంతమంది మంత్రి డైమండ్ రాణి అంటూ కామెంట్స్ చేయగా.. దీంతో రోజా పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అంటూ కామెంట్లు చేశారు. జగన్తో పోటీ పడలేను చేతకాదని పవన్ స్వయంగా అంగీకరించారని రోజా చెప్పుకొచ్చింది. అది జగన్ పవర్ అంటే అంటూ రోజా వివరించింది.
మంత్రి రోజా రాజకీయంగా మెగా బ్రదర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు పైన పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. రాజకీయంగా పవన్, నాగబాబు గురించి విమర్శలు చేయడం పక్కన పెడితే చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం పైన ఆమె పైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని వైసీపీ కావాలని చిరంజీవితో సన్నిహితంగా ఉంటూ పవన్ ను ఆత్మరక్షణ లోకి నెట్టే వ్యూహం అమలు చేసింది. మెగా ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు రోజా. చిరంజీవి, బాలయ్యకు సంక్రాంతి కొత్త సినిమాలతో కలెక్షన్స్ వస్తే..పవన్ కు చంద్రబాబు నుంచి కలెక్షన్స్ వచ్చాయని వ్యాఖ్యానించింది.
నాగబాబు మనిషి ఎదిగారు కానీ మెదడు పెరగలేదని రోజా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. అమ్ముడుపోయే వ్యక్తులు తమ గురించి మాట్లాడితే ఊరుకోమని కౌంటర్ వేసింది. తాము కళాకారులతో డాన్స్ చేస్తే టోల్ చేస్తున్నారని వారు మాత్రం కూతురు వయసున్న అమ్మాయితో డాన్స్ చేయడం ఓకేనా అంటూ ప్రశ్నిస్తోంది. పవన్ అన్నిట్లోనూ పేలయ్యారని చిరంజీవి ఉండబట్టే ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయని తానే స్వయంకృషితో ఎదిగానని రోజా చెప్పుకొచ్చింది.చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాలు కూడా లేవని చంద్రబాబు పైన కూడా రోజా ఫైర్ అయ్యింది.