టాలీవుడ్లో ఒకప్పుడు ఎన్నో చిత్రాలను సైడ్ క్యారెక్టర్లు నటించారు నటుడు రవితేజ.. అలా వేస్తూ ఎదిగారు రవితేజ . ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా పనిచేసి హీరో పొజిషన్ కి ఎదిగాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇడియట్ మూవీతో హీరోగా నిలబడి స్థిరపడ్డాడు. కానీ రవితేజ అనుకోకుండా చాలా సినిమాలను వదులుకున్నాడు. అందులో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.
ఇక రవితేజ వదిలేసిన సినిమాల విషయానికి వస్తే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో బిజీగా ఉండే టైంలో ఆనందం కథను రవితేజకు శీను వైట్ల వినిపించారట. కానీ బిజీగా ఉండటంతో ఆ సినిమాను వదులుకున్నాడు. ఇక ఆర్య సినిమాను కూడా చాలామంది అగ్ర హీరోలతో చేయాలనుకున్నారు సుకుమార్..కానీ అందరూ రిజెక్ట్ చేయడంతో ఆఖరికి బన్నీకి సెట్ అయింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు
పూరి జగన్నాథ్ ఉత్తమ్ సింగ్ పేరుతో పోకిరి చిత్రాన్ని రవితేజ తో చేద్దామని అనుకున్నప్పటికీ రవితేజ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో మహేష్ బాబు దగ్గరకు వచ్చి చేరింది. అలా గోదావరి, కందిరీగ, జై లవకుశ, వంటి సూపర్ హిట్ మూవీలను వదులుకున్నాడు మాస్ మహారాజ్
ఇక కందిరీగ స్టోరీని సంతోష్ శ్రీనివాస్ రవితేజకు చెప్పినప్పటికీ అతడు హోల్డ్ లో పెట్టడంతో ఈ సినిమాకి రామ్ ని ఫిక్స్ చేశారు. ఇక ఆ తరువాత గబ్బర్ సింగ్ మూవీ ని హరి శంకర్ మొదట రవితేజ తో చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ దబాంగ్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయటంతో అలా చేజారిపోయింది. అప్పట్లో రవితేజ ఒక సినిమా తర్వాత ఒకటి చేస్తూ బిజీగా ఉండటంతో ఈ సినిమాలన్నింటిని వదులుకున్నాడు. రీసెంట్ గా ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా చిరంజీవితో కలిసి వాల్తేర్ వీరయ్య సినిమాలో నటించారు.