Rocket Raghava.. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో జబర్దస్త్ (Jabardast) కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ జబర్దస్త్ ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాలలో కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2013లో ప్రారంభమైన ఈ జబర్దస్త్ కార్యక్రమం ఈనెల 500వ ఎపిసోడ్ ను చాలా ఘనంగా నిర్వహించింది. ఇప్పటికే జబర్దస్త్ ఎపిసోడ్లలో కొంతమంది పాల్గొని ఆ తర్వాత సినిమాలో అవకాశాలు రావడంతో జబర్దస్త్ వదిలి ఇండస్ట్రీ వైపు వెళ్ళిన విషయం తెలిసిందే. కానీ రాకెట్ రాఘవ (Rocket Raghava) మాత్రం సినిమాలలో అవకాశాలు వచ్చినా సరే ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు జబర్దస్త్ లో తన కెరియర్ కొనసాగించారు.
మొదటినుంచి చివరి వరకు ఉన్న ఏకైక కంటెస్టెంట్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు రోజా చేతులు మీదుగా ఈయనకు ప్రత్యేకమైన సన్మానం కూడా జరిగింది. మొత్తానికైతే రాకెట్ రాఘవ (Rocket Raghava) జబర్దస్త్ లో తన కెరీర్ ను కొనసాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకెట్ రాఘవ ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డిని తాను మోసం చేశాను అంటూ పశ్చాత్తాపడుతున్నాడు. అసలు విషయం ఏమిటంటే .. రాకెట్ రాఘవ మాట్లాడుతూ.. నేను హైదరాబాదుకి సినిమా అవకాశాల కోసం వచ్చినప్పుడు మొదట్లో సీరియల్స్ లో నటించడానికి శ్రీరామ్ నాకు సహాయం చేశారు. ఆయన సహాయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను.
అంతేకాదు ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా నాకు ఎన్నో విషయాలలో అండగా నిలిచారు. ఆయన, నేను ఇద్దరం కలిసి ఎన్నో షోలు , కార్యక్రమాలు కూడా చేశాము. అయితే ఒకానొక సమయంలో నేను చేసిన తప్పిదం వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటూ తెలిపారు. అసలు విషయం ఏమిటంటే ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే నవ్వుల సవాల్ అనే కార్యక్రమానికి యాంకర్ గా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించేవారు. ఒకరోజు ఈ కార్యక్రమానికి చెందిన డైరెక్టర్ నన్ను పిలిచి ఈ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తావా అని అడిగారు. అప్పుడు నేను ముందు వెనుక ఆలోచించకుండా ఒకే చెప్పాను. ఒక ఎపిసోడ్ కూడా షూట్ అయిపోయింది.
అసలు ఈ విషయమే తెలియని శ్రీనివాసరెడ్డి (Sreenivareddy) ఆ తర్వాత వచ్చి అక్కడ జరిగిన విషయం తెలుసుకొని వెళ్ళిపోయారు.. ఆ తరువాత శ్రీనివాస్ రెడ్డి నా దగ్గరకు వచ్చి ఒకవేళ నువ్వు ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటే ముందుగా నాతో చెప్పి ఉండాల్సింది కదా అంటూ అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు అప్పుడే నాకు అసలు విషయం అర్థమై బాధేసింది. ఇప్పటికీ శ్రీనివాస్ రెడ్డి విషయంలో చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నాను అంటూ తెలిపారు రాకెట్ రాఘవ.