బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో ,మరొకవైపు రాజకీయాలలో ,మరొకవైపు హోస్టుగా అదరగొట్టేస్తున్నారని చెప్పవచ్చు. ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తి అయ్యింది. గత ఏడాది రెండో సీజన్ కూడా మొదలై త్వరలోనే ఇది కూడా ముగియనుంది. అయితే ఈ షో కి ఎన్టీఆర్ ఖచ్చితంగా హాజరవుతారని అభిమానులందరూ భావించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఈ షోకు వచ్చేలా కనిపించలేదు. ముఖ్యంగా చిరంజీవి కూడ అన్ స్టాపబుల్ షో కి హాజరు కాకపోవడం గురించి కూడా స్పందిస్తూ అసలు విషయాన్ని తెలియజేయడం జరిగింది.
చిరంజీవి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ షోకి ఆహ్వానం అందలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రీజన్ వల్లే ఎన్టీఆర్ చిరంజీవి కూడా ఇద్దరు హాజరు కాలేదని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ఈ షోలో సందడి చేస్తారేమో చూడాల్సి ఉన్నది.. ఈ మధ్యకాలంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఓకే ఫ్రేమ్ లో కనిపించిన సందర్భాలు లేవని చెప్పవచ్చు. నందమూరి అభిమానులు మాత్రం వీరిద్దరిని కలిపి చూడాలని కోరిక అలాగే ఉన్నది.అన్ స్టాపబుల్ షోలో వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ ఎపిసోడ్ లో బాలయ్య అభిమానులను మెప్పించేలా ఉండబోతుందని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నాయి. అలాగే వాల్తేర్ వీరయ్య సినిమా కూడా మంచి హిట్టు టాక్ తో కలెక్షన్లను అందుకుంటోంది. మరి రాబోయే రోజుల్లోనైనా ఎన్టీఆర్ చిరంజీవి అన్ స్టాపబుల్ షో కి గెస్ట్లుగా వస్తారేమో చూడాలి మరి.