తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీయన్ గా పేర్కొన్నారు కమెడియన్ హైపర్ ఆది. ఈమధ్య పలు చిత్రాలలో కూడా కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా పొలిటికల్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నిన్నటి రోజున ఒక వేదిక పైన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైపర్ ఆది స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి. బుల్లితెరపై కామెడీ ప్రోగ్రాంతో మెగా ఫ్యామిలీకి దగ్గరైన హైపర్ ఆది ఇప్పుడు రాజకీయాల వైపు చూస్తున్నారు.
గత ఎన్నికలలో జనసేన తరపున నాగబాబుతో కలిసి ప్రచారం చేశారు హైపర్ ఆది. ప్రస్తుతం క్రీష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాల్లో కూడా నటిస్తున్నారు హైపర్ ఆది. ఈ సినిమా షూటింగ్ స్పాట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మరింత దగ్గర అవడంతో జనసేన వేదికపై కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది.అయితే హైపర్ ఆది మాట్లాడుకునే మాటల్లో తీరుబట్టి ఆయన స్పీచ్ ని పవన్ కళ్యాణ్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.
హైపర్ ఆది మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని విమర్శించే వారి పైన తన స్వస్థలంలోనే పంచుల వర్షం కురిపించారు. గతం నుంచి హైపర్ ఆది ఎన్నో పబ్లిక్ మీటింగ్ల్లో కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పైన తన అభిప్రాయాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం యువశక్తి మీటింగులో మాత్రం ఒక అభ్యర్థిగా మాట్లాడుతున్న అన్న పదానికి అర్ధాలు వేరే ఉంటాయి అంటూ పొలిటికల్ సర్కిల్స్ జనసేన అధినేత నుంచి హామీ ఉండబట్టే ఆది ఇలా వెళ్లి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది అభిమానులు మాత్రం పొలిటికల్ లోకి వెళ్లి హైపర్ ఆది తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.