పాపం ఈ స్టార్ హీరోయిన్ల పరిస్థితి ఒకేదారి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటించేందుకు సినిమాలు డేట్లు లేవంటూ చెప్పిన హీరోయిన్ల రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు.ఒకానొక సమయంలో ఈమె టాలీవుడ్లో స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. ఇక రెండు సంవత్సరాలు భాగానే టాలీవుడ్లో అగ్ర హీరోలలో నటించిన ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీతిసింగ్ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు.

Pooja And Rakul Kicking Each Other! | cinejosh.com

అదృష్టం కొద్ది బాలీవుడ్లో కొన్ని సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. మొత్తానికి రకుల్ ప్రీతిసింగ్ స్టార్ గా కేవలం మూడు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగింది. ఈ మూడు సంవత్సరాలలో ఏమి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు కనీసం ఈమెను పట్టించుకునేవారు లేరంటే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈమె తరహాలోనే ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ పరిస్థితి కూడా ఎదురవుతోంది ఆమె ఎవరో కాదు హీరోయిన్ పూజ హెగ్డే.

రెండు సంవత్సరాల పాటు పూజా హెగ్డే హడావిడి బాగా కొనసాగిన స్టార్ హీరోలు అందరితో కూడా నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచింది. అతి తక్కువ సమయంలోనే అవకాశాలు లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ముద్దుగుమ్మకు. ఇక రకుల్ ప్రీతిసింగ్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి కూడా అలాగే అవుతోంది అంటు పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమాల తప్ప మరో సినిమాలో నటించలేదు.

Share.