2023 లో ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన చిత్రాలలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా ఇద్దరికీ కూడా ఖచ్చితంగా ప్లస్ అవుతుందని పలువురు అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇక చిరంజీవికి కూడా ఈ చిత్రంతో మరిన్ని అవకాశాలు వెల్లుబడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. వీరితో పాటు వీరసింహారెడ్డి సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్, హాని రోజు కూడా నటిస్తూ ఉన్నారు. హనీ రోజ్ ఈ సినిమాతో తాను మంచిగా నటిగా ప్రూఫ్ చేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా ఈమె సినీ కెరియర్ మారిపోతుందని చెప్పవచ్చు. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య భార్యగా నటించింది.
అయితే హనీ రోజు మాత్రం రిస్కీ రోల్ ను ఎంచుకొని ఫ్యాన్స్ అని మెప్పించింది. శృతిహాసన్ తో పోలిస్తే హనీ రోజ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఆమె అద్భుతమైన నటనతో అందంతో అభినయంతో మెప్పించిందని అభిమానులు ఊహించని స్థాయిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ సినిమాతో ఇప్పటికే మెప్పించిన ఈమె మరొకసారి ఈ చిత్రంలో కూడా నూటికి నూరు శాతం న్యాయం చేశారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే స్క్రీన్ ప్లే కొత్తగా ఉండి బాలయ్య వరలక్ష్మి కాంబో సీన్లు అభిమానులను మరింత ఎక్కువగా ఆకట్టుకునేవి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో మరిన్ని విభిన్నమైన పాత్రల్లో బిజీగా అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.తెలుగులో రాబోయే రోజుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్గా బిజీగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.
చాలామంది నటీనటుల పారితోషకంతో పోలిస్తే వరలక్ష్మి రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం. మరి శృతిహాసన్ వరలక్ష్మి శరత్ కుమార్ హనీ రోజ్ వీరందరి కెరియర్లు మారుతాయేమో చూడాలి మరి