వాల్తేరు వీరయ్య చిత్రంతో చిరంజీవి మెప్పించారా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో చిరంజీవి ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య సినిమాతో ఈరోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా ఓవరాల్ గా ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఎలా ఉంది. చిరంజీవి సక్సెస్ అయ్యారా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Chiranjeevi Waltair Archives - Cine Chit Chat

వాల్తేరు వీరయ్య సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ బాగుండడంతో ఈ సినిమాకు ప్లస్సుగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా కథ పాయింట్ రొటీన్ గా ఉన్నప్పటికీ కథలో ఊహించని ట్విస్టులు రవితేజ చిరంజీవి మధ్య జరిగేటటువంటి సన్నివేశాలు శృతిహాసన్, చిరంజీవి మధ్య జరిగేటటువంటి రొమాంటిక్ సన్నివేశాలు సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్ రవితేజ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ అయినా భారీగా అంచనాలు పెంచేలా కనిపిస్తోందని ఇక సెకండ్ హాఫ్ లో రవితేజ ఎంట్రీ తర్వాత చిరంజీవి రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా తో చిరంజీవి వేసిన వేర్ ఇస్ ద పార్టీ సాంగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ఇక చిరంజీవి ఫుల్ లెన్త్ మాస్ మసాలా క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాకుండా సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా తో పాటు బాలయ్య సినిమా కూడా విడుదలయ్యింది నిన్నటి రోజున బాలయ్య సినిమా కూడా విడుదలై మంచి హీట్ టాక్ తెచ్చుకుంది. మరి చిరంజీవి బాలయ్య సినిమాలలో ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Share.