సాధారణంగా కొన్ని కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, వెంకటేష్ కూడా ఒకరు. వీరి ఇద్దరు కాంబినేషన్లో సినిమాలు రావాలి అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుల్లో మేటి నటుడు నందమూరి తారక రామారావు అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేయని పాత్ర లేదు.. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలకు ఎన్టీఆర్ నటన పెట్టింది పేరు. అలాంటి ఎన్టీఆర్ ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఎన్టీఆర్ మరియు వెంకటేష్ కలసి ఒక మూవీ చేయాలని ప్లాన్ చేశారట కానీ ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్. ఈ క్రమంలోనే వెంకీ మామ, ఎఫ్ 2, ఎఫ్ 3, గోపాల గోపాల వంటి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. ఇకపోతే ఇలా ఎంతోమంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్ ఎన్టీఆర్ తో కలిసి ఒక చిత్రం చేయాలనుకున్నారు. కానీ కోరిక తీరలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ ని వెంకీ తో కలిసి ఎన్టీఆర్ చేయాలనుకున్నారట. ఇందులో శాతకర్ణి పాత్రకు వెంకటేష్ ను తీసుకుందామని కూడా భావించారట.
శ్రీపాద కవి సార్వభౌమ అనే చిత్రానికి ముందే గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ కథను రెడీ చేయించడం జరిగింది. వెంకటేష్ కూడా ఆనందపడ్డాడు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ అవడంతో సినిమా సెట్స్ మీదకు రాకుండానే మధ్యలోనే ఆగిపోయింది. అయితే డైరెక్టర్ క్రిష్ ఇదే సినిమాను బాలయ్యతో తీసిన విషయం తెలిసిందే. అలా వెంకటేష్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా కుదరకపోవడంతో కలిసుందాం రా సినిమాలో నచ్చావే పాలపిట్ట అనే పాటలో ఎన్టీఆర్ యానిమేషన్ తో పక్కన నటించి కోరిక తీర్చుకున్నాడు వెంకటేష్.